కొత్త రేషన్‌కార్డులకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-04-17T06:28:28+05:30 IST

నాలుగేళ్లకు పైగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబు రు చెప్పింది. కొత్త రేషన్‌కార్డులకు గ్రీన్‌సిగ్న ల్‌ ఇచ్చింది. కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎంతో మంది పేదలు ఎదురుచూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 21 వేల మం దికి పైగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకో గా ప్రభుత్వం నుంచి ఆమో దం లభించలేదు.

కొత్త రేషన్‌కార్డులకు గ్రీన్‌ సిగ్నల్‌

మంజూరుకు  సర్కారు సన్నద్ధం

జిల్లాలో కార్డుల కోసం 21,452 దరఖాస్తులు


(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): నాలుగేళ్లకు పైగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబు రు చెప్పింది. కొత్త రేషన్‌కార్డులకు గ్రీన్‌సిగ్న ల్‌ ఇచ్చింది. కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎంతో మంది పేదలు ఎదురుచూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 21 వేల మం దికి పైగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకో గా ప్రభుత్వం నుంచి ఆమో దం లభించలేదు. దాదాపు ఆన్‌లైన్‌లో అన్నిదశల్లో విచారణ పూర్తయినా ప్రభుత్వం నుం చి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూ రు చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండ గా వేలాదిగా ఉన్న దరఖాస్తులను పరిశీలించడంలో కొంత ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం 2017 జూన్‌ నుంచి ఆహారభద్ర త కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేయడంతో జిల్లాలో వేలాది మంది నిరుపేదలు రేషన్‌ సరుకుల కోసం అవస్థలు పడ్డారు. నిరుపేదల ఇక్కట్లను గుర్తించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకుని, ఆమోదం పొందిన వారికి బియ్యం కోటా మంజూరు చేయనుంది. 


రేషన్‌కార్డుల కోసం జిల్లాలో మీసేవ కేంద్రాల ద్వారా 21,452 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై తహసీల్దార్లు విచారణ నిర్వహించారు. గతంలోనే 13,600 దరఖాస్తుదారులు అర్హులుగా గుర్తించి వారికి కార్డు లు మంజూరు చేశారు. ఇంకా 8 వేలకు పైగా దరఖాస్తుల విచారణ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రేషన్‌కార్డులు ఉండి అందులో వారి కుటుంబ సభ్యుల నమోదు లేని వారు నూతనంగా నమోదు చేసుకునేందుకు 28,400 దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కూడా 21 వేల దరఖాస్తుల కు ఆమోదం తెలిపారు. ఇంకా 7,300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో అనేకమంది ఇతర పనుల నిమిత్తం వలస వెళ్తుం టారు. వారే ఎక్కువగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు సమీపంలోని పలు గ్రామాల ప్రజలు హైదరాబాద్‌కు వలస వెళ్తారు. మేస్ర్తీ, కూలీ పనులు, సెక్యూరిటీ గార్డులుగా పెద్దసంఖ్యలో పని చేస్తున్నారు. వీరందరికీ రేషన్‌ కార్డులు లేకుండాపోయాయి. సమయానికి దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల కార్డులు లభించలేదు. వీరందరికి తాజాగా ప్రభుత్వం కార్డులు అందజేస్తుండడంతో కొంత మేర ఉపశమనం కలుగనుంది. 


జిల్లాల్లో సరుకుల పంపిణీ ఇలా

జిల్లాలో 609 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా కిరోసిన్‌, బియ్యం, పంచదార పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షల 15వేల 180 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అందులో 2లక్షల 96 వేల 359 ఆహార భద్రత కార్డులు, 18,773 అంత్యోదయ కార్డులు, 48 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఈ లబ్ధిదారులకు ప్రభుత్వం నెలకు 59,52,779 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. దీంతో పాటు 3,840 లీటర్ల కిరోసిన్‌, లక్షా53,200 కిలోల పంచదారను సరఫరా చేస్తోంది. 


 ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మంజూరు : విజయలక్ష్మి, డీఎ్‌సవో

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు పంపిణీ చేస్తాం. కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమో దు చేయాలని అనేక దరఖాస్తులు వ చ్చాయి. అన్నింటినీ పరిశీలించి  మార్పులు, చేర్పులు చేసి నూతన రేషన్‌ కార్డులు అందజేస్తాం. 


Updated Date - 2021-04-17T06:28:28+05:30 IST