పొలాల్లో పచ్చిరొట్ట పైర్లు పెంచాలి

ABN , First Publish Date - 2022-05-21T05:06:09+05:30 IST

రైతులు తమ పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడం కోసం పచ్చిరొట్ట పైర్లు పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌ సూచించారు.

పొలాల్లో పచ్చిరొట్ట పైర్లు పెంచాలి
నారాయణరావుపేటలో మాట్లాడుతున్న జిల్లా అధికారి శివప్రసాద్‌

  ఆయిల్‌పామ్‌కు మార్కెట్‌లో డిమాండ్‌ 

 పత్తి సాగు చేసే రైతులకు మరిన్ని లాభాలు

 జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌


నారాయణరావుపేట, మే 20: రైతులు తమ పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడం కోసం పచ్చిరొట్ట పైర్లు పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌ సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులకు వానాకాలం పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ.. యూరియా పెద్ద మొత్తంలో వాడడంతో పంటకు ప్రయోజనం ఉండదని, అవసరాన్ని బట్టి దఫాలుగా వేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆయిల్‌పామ్‌ను సాగు చేసి, మంచి లాభాలు గడించవచ్చునని చెప్పారు. ఈసారి పత్తి పంటకు కూడా మంచి డిమాండ్‌ ఉంటుందని, సాగు చేసే రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెంచేందుకు రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు చొరవ చూపించాలన్నారు. నారాయణరావుపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన సీడ్‌ బ్యాంకు విధానం బాగుందని, ఇదేవిధంగా అన్ని రైతు వేదికల్లో రైతుల వివరాలతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జక్కాపూర్‌, గుర్రాలగొంది రైతు వేదిక భవనాలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పద్మ, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సెరికల్చర్‌ అధికారి ఇంద్రసేనారెడ్డి, హార్టికల్చర్‌ అధికారి భాస్కర్‌రెడ్డి, ఏవో ప్రకా్‌షగౌడ్‌, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మట్టే బాల్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌, సర్పంచ్‌లు దేవయ్య, శంకర్‌, ఏఈవో నాగార్జున్‌ ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-05-21T05:06:09+05:30 IST