పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌కు పచ్చజెండా

ABN , First Publish Date - 2021-05-13T08:22:06+05:30 IST

కొవాగ్జిన్‌తో 2-18 ఏళ్లలోపు వారిపై రెండు, మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ

పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌కు పచ్చజెండా

డీజీసీఐకి సిఫారసు చేసిన ఎస్‌ఈసీ 

టీకా పంపిణీలో మాపై దురుద్దేశాలా?

50 మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డా.. ముందుకే

18 రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు డోసుల సరఫరా 

భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా ట్వీట్‌

 


న్యూఢిల్లీ, మే 12 : కొవాగ్జిన్‌తో 2-18 ఏళ్లలోపు వారిపై రెండు, మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో)కు చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫారసు చేసింది. దీంతో ఈవిషయమై భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తుపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదముద్ర వేయడమే తరువాయి.  ఎయిమ్స్‌ పాట్నా, ఎయిమ్స్‌ ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సహా దేశంలోని వివిధ కేంద్రాల్లో 525 మందిపై టీకాను పరీక్షించనున్నట్లు సమాచారం. కొవాగ్జిన్‌ సరఫరాపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విమర్శలపై భారత్‌ బయోటెక్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా స్పందించింది. ‘‘కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది.


మా కంపెనీలో పనిచేసే దాదాపు 50 మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. అయినా ప్రజల కోసం, దేశం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నాం. టీకా ఉత్పత్తి ప్రక్రియలో రాజీలేకుండా పరిశ్రమిస్తున్నాం. 18 రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు కొవాగ్జిన్‌ డోసులను పంపుతున్నాం. అయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం నిరుత్సాహపరిచే అంశమే’’ అని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్లా ఆవేదన వెళ్లగక్కారు. 

Updated Date - 2021-05-13T08:22:06+05:30 IST