జూన్‌ 20 నుంచి హరితహారం ప్రారంభం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-23T10:30:07+05:30 IST

జూన్‌ 20వ తేది నుంచి హరి తహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, గ్రామ, మున్సిపాలిటీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు

జూన్‌ 20 నుంచి  హరితహారం ప్రారంభం: కలెక్టర్‌

కామారెడ్డి, మే 22: జూన్‌ 20వ తేది నుంచి హరి తహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, గ్రామ, మున్సిపాలిటీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడానికి పది రోజుల్లో మైక్రోయాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని కలెక్టర్‌ శరత్‌ జిల్లా అధికారులను ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌ లో జిల్లా అధికారులతో హరితహారం కార్యక్రమం ప్రారంభ పనులపై సమీక్షించారు. గ్రామ, మున్సిప ల్‌ ప్రాంతాల్లో 65లక్షల 20 వేల మొక్కలు నాటడా నికి ప్రణాళిక సిద్ధం చేయాలని, మొక్కలు నాటే ప్రాంతాలు, వివరాలతో పది రోజుల్లో మైక్రో యాక్షన్‌ ప్లాన్‌తో సిద్ధం కావాలని ఆదేశించారు.


జూన్‌ 20వ తేదిన హరితహారం ప్రారంభం సందర్భంగా ప్రతీశా ఖ ఐదు చోట్ల మొక్కలు నాటి ప్రారంభించాలని తె లిపారు. వ్యవసాయశాఖ, తమ క్లస్టర్‌లలో రైతు వే దికల స్థలాల్లో, జిల్లా విద్యాశాఖ జిల్లాలోని అన్ని పా ఠశాలలో మొక్కలు పెంచాలని తెలిపారు. 300 మంకీ పుడ్‌ కోర్టులలో 500 మొక్కలు చొప్పున నాట డానికి సిద్ధం కావాలని తెలిపారు. చింత, పండ్ల మొ క్కలు, దోమలను అరికట్టే కృష్ణ తులసిని నాటేం దు కు చర్యలు తీసుకోవాలని సూచించారు. 


రూర్బన్‌ పథకం పనులు వేగవంతం చేయాలి

జుక్కల్‌ నియోజకవర్గంలో రూర్బన్‌ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని  కలెక్టర్‌ శరత్‌ అన్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేతో కలిసి రూర్భన్‌ పథకం కింద జరుగుతున్న పనుల ప్రగతిని సమీక్షించారు. తొ మ్మిది స్టోరేజీ గోదాంలు, ప్లాట్‌ ఫా మ్స్‌ నిర్మాణ పనులకు ఎనిమిది ప నులు పూర్తయ్యాయని, ప్రగతిలో ఉందని తెలిపారు. మిగతా పనుల్లో నూ వేగం పెంచి అనుకు న్న సమ యంలోగా లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయ న్న, తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-05-23T10:30:07+05:30 IST