గ్రేటర్‌లో మరో 1189 కేసులు

ABN , First Publish Date - 2022-01-29T16:35:42+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన అయిదారు రోజుల నుంచి కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి

గ్రేటర్‌లో మరో 1189 కేసులు

కాస్త తగ్గిన కరోనా

హైదరాబాద్‌ సిటీ:  గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన అయిదారు రోజుల నుంచి కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1189 మందికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. వారం రోజులకు ముందు భారీగా ఉన్న కేసులు 23 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. 27న 1372, 26న 1570, 25న 1450, 24న 1439, 23న 1421, 22న 1643 కేసులు నమోదయ్యాయి. వారం రోజులతో పోల్చుకుంటే శుక్రవారం దాదాపు 454 కేసులు తగ్గాయి.

Updated Date - 2022-01-29T16:35:42+05:30 IST