ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-05-29T10:39:28+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని కర్నూలు ..

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 28: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి టీజీ భరత్‌ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీజీ భరత్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేశారన్నారు. మండల వ్యవస్థ, మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు తదితర మరెన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసి ఎన్టీరామారావు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తిరుపాల్‌బాబు పాల్గొన్నారు. 


 ‘టీడీపీ మళ్లీ అధికారం చేపడుతుంది’

 తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో  అధికారంలోకి వస్తుందని   నగర 38వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి వై.రామేశ్వరరెడ్డి అన్నారు. మామిదాలపాడు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  


నంద్యాల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నం దమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యాలయంలో వేర్వేరుగా టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఆళ్లగడ్డ: పేదల హృదయాల్లో చిరస్మరణీయుడుగా ఎన్టీఆర్‌ నిలిచిపోయారని టీడీపీ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి అన్నారు.   రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని స్వగృహంలో గురువారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, కేక్‌ కట్‌ చేశారు.  


మహానంది: యుగపుషుడు ఎన్టీఆర్‌ అని శ్రీశైలం నియోజికవర్గ టీడీపీ సమన్యయకర్త బన్నూరి రామలింగారెడ్డి అన్నారు. గురువారం మహానంది సమీపంలోని  ఎన్టీఆర్‌  విగ్రహానికి మండల టీడీపీ కార్యకర్తలు క్షీరాభిభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  


బండి ఆత్మకూరు:  ఎన్టీ రామారావు 98వ జయంతి వేడుకలు   పెద్దదేవళాపురం, బండిఆత్మకూరు, జీసీ పాలెం, చిన్నదేవళాపురం గ్రామాల్లో నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి  అర్పించారు.  


పాములపాడు(వెలుగోడు):  రామారావు  జయంతి వేడుకలను గురువా రం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వీబీఆర్‌ వద్ద ఏర్పాటు చేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ గావించి కేక్‌ కట్‌ చేశారు.  


శ్రీశైలం:  రామారావు చిరస్మరణీయమైన నేత అని మండల టీడీపీ నాయకులు అడుసుమల్లి సుబ్బారావు, మైలా శ్రీనివాసులు, వేశపోగు బెంజిమెన్‌ అన్నారు.  గురువారం సున్నిపెంట  ఫిల్టర్‌హౌస్‌ సెంటర్‌ వద్దగల ఎన్టీఆర్‌ విగ్రహానికి వారు పూలమాలలు వేసి  నివాళి అర్పించారు.  


డోన్‌: తెలుగు ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు మరువలేనివని డోన్‌ మార్కెట్‌యార్డ్‌  మాజీ చైౖర్మన్‌ మురళీక్రిష్ణగౌడ్‌, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ జడ్పీటీసీ వలసల రామక్రిష్ణ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు నివాళి అర్పించారు.  


డోన్‌(రూరల్‌):  ఎన్టీఆర్‌ కారణజన్ముడని ఆయన అభిమాన సంఘం  అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు హుస్సేన్‌పీరా, చంద్రశేఖర్‌  అన్నారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని  అయన విగ్రహానికి పూలమాలలు వేశారు. 


ప్యాపిలి:  టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.  టీడీపీ నాయకులు టి. శ్రీనివాసులు, రామ్మోహన్‌ యాదవ్‌ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  


కోడుమూరు(రూరల్‌): నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని తెలుగు యువత మండల అధ్యక్షుడు మాదన్న అన్నారు. మండలంలోని అమడగుంట్లలో గురువారం టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించారు.     


గూడూరు: పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చరణ్‌కుమార్‌, రాజారెడ్డి, బతుకన్న అన్నారు. గురువారం పాతబస్టాండులో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.  


ఓర్వకలు:  ఓర్వకల్లులో గురువారం ఎన్టీఆర్‌  జయంతిని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  


చాగలమర్రి: ఎన్టీఆర్‌  చిరస్మరణీయుడని  టీడీపీ మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా తెలిపారు. గురువారం   టీడీపీ కార్యాలయంలో ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  


శిరివెళ్ల: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శిరివెళ్లలో మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి  నివాళి అర్పించారు. 

 

ఆత్మకూరు: తెలుగుజాతి గర్విందగిన  మహోన్నతవ్యక్తి నందమూరి తారకరామారావు అని మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరాముడు అన్నారు. గురువారం స్థానిక గౌడ్‌సెంటర్‌లో ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. 


వృద్ధాశ్రమంలో అన్నదానం :   ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం కరివేన గ్రామశివార్లలోని మానవతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తెలుగు యువత జిల్లా కార్యదర్శి సతీ్‌షబాబు అధ్వర్యంలో అన్నదానం చేశారు.


కోడుమూరు: టీడీపీ కార్యాలయంలో  ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.  కార్యక్రమంలో కేఈ మల్లికార్జునగౌడ్‌, మాజీ సర్పంచు కేఈ రాం బాబు, దుబ్బన్న పాల్గొన్నారు. 


పాణ్యం:  మాజీ ముఖ్యమంత్రి   రామారావు జయంతి వేడుకలు గురువారం పాణ్యం టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నాయకులు ఆయన  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  


బేతంచెర్ల: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత నందమూరి తారకరామారావుదే అని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోలూరి భాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ అశోక్‌కుమార్‌  పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  


కర్నూలు(రూరల్‌): మండలంలోని బి.తాండ్రపాడులో టీడీపీ నాయకుడు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో  గురువారం  ఎన్టీఆర్‌  జయంతిని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 


Updated Date - 2020-05-29T10:39:28+05:30 IST