మహా గౌరవం

ABN , First Publish Date - 2021-03-05T06:42:03+05:30 IST

దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం దక్కింది.

మహా గౌరవం

ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో విశాఖపట్నం

దేశంలో 15వ స్థానం, 24వ స్థానంలో హైదరాబాద్‌

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో బెంగళూరు నిలవగా, హైదరాబాద్‌ 24వ స్థానంలో, విజయవాడ 41వ స్థానాల్లో నిలిచాయి. స్మార్ట్‌ సిటీ ప్రోగ్రామ్‌ కింద కేంద్ర ప్రభుత్వం నగరాల్లో పట్టణీకరణ సవాళ్లను అధిగమించడం, మౌలిక సదుపాయాల సృష్టి, ప్రజల జీవన నాణ్యతను పెంపొందించడం, పరిపాలనలో పారదర్శకత, నిజాయితీని పెంపొందించేందుకు మునిసిపల్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ (2020) కింద ఆన్‌లైన్‌లో ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ కేటగిరీ పేరుతో ఈ పోటీ నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా వున్న 111 నగరాలు పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన ఫలితాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి గురువారం నిర్వహించిన స్మార్ట్‌సిటీ కమిషనర్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. పది లక్షల కంటే ఎక్కువ జనాభా వున్న నగరాల కేటగిరీలో బెంగళూరుకు మొదటి స్థానం దక్కగా, విశాఖకు 15వ స్థానం దక్కినట్టు జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఒక  ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-03-05T06:42:03+05:30 IST