Abn logo
Mar 30 2020 @ 05:10AM

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

టెక్కలి: టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి ఆధ్వర్యంలో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఒక మహాశక్తి అని అన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


సోంపేటలో...

సోంపేట (రూరల్‌): టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మద్ది నాగేశ్వరరావు తన స్వగృహంలో ఆదివారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాకన్నవలసలో మాస్కులను పంపిణీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement