కేజీబీవీ కళాశాలలకు భవనాలు మంజూరు

ABN , First Publish Date - 2022-01-21T05:24:24+05:30 IST

జిల్లాలో 9 కేజీబీవీ జూనియర్‌ కళాశాలలకు రూ.12.90 కోట్లతో తొమ్మిది భవనాలు మంజూరు చేశామని సమగ్ర శిక్షా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ అప్పలనాయుడు తెలిపారు.

కేజీబీవీ కళాశాలలకు భవనాలు మంజూరు
బూసాయవలసలో మాట్లాడుతున్న ఏపీసీ

రామభద్రపురం, జనవరి 20: జిల్లాలో 9  కేజీబీవీ జూనియర్‌ కళాశాలలకు రూ.12.90 కోట్లతో తొమ్మిది భవనాలు మంజూరు చేశామని సమగ్ర శిక్షా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ అప్పలనాయుడు తెలిపారు.   బూసాయవలస  కేజీబీవీ కళాశాలలో చేపడుతున్న పనులను గురువారం  పరిశీలించారు. ఈ పనులకు రెండో విడతలో రూ.3 కోట్ల 98 లక్షలు విడుదల చేశామని తెలిపారు. అయితే  బూసా యవలస, గజపతినగరం భవన నిర్మాణాలు నత్తనడకగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. బూసాయవలస కేజీబీవీ జూనియర్‌ కళాశాలకు రూ.కోటి 60 లక్షలు కేటాయించగా ఇప్పటికే రూ.40 లక్షలు విడుదల చేశామన్నారు. అయిన ప్పటికీ పనులు పూర్తికాక పోవడంతో కాంట్రాక్టర్‌ను తొలగించ నున్నామని తెలిపారు.  ఈ ఏడాది కేజీబీవీ పాఠశాలలో  టెన్త్‌ ఫలితాలు శతశాతం సాధించే విధంగా చర్య లు తీసుకుంటు న్నామని చెప్పారు. మొత్తంగా 1320 మంది టెన్త్‌ చదువుతున్నట్లు వెల్లడించారు. వీరిలో వంద మంది పిల్లలకు ట్రిపుల్‌ ఐటీ ర్యాంకులు సాధించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

 

Updated Date - 2022-01-21T05:24:24+05:30 IST