ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-01-17T05:04:48+05:30 IST

సంక్రాంతి పండుగను జిల్లాలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల్లో శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగలు ఘనంగా జరిగాయి.

ఘనంగా సంక్రాంతి వేడుకలు
కోరుకొండ: జంబుపట్నంలో లక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవ దృశ్యం

  • అమ్మవారు, స్వామి వార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • పలుచోట్ల ముగ్గులపోటీలు
  • కనుమ రోజున పశువులను అలంకరించి పూజించిన రైతులు

రాజమహేంద్రవరం సిటీ/దివాన్‌చెరువు, జనవరి 16: సంక్రాంతి పండుగను జిల్లాలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల్లో శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగలు ఘనంగా జరిగాయి. ప్రతీ ఇల్లు కొడుకులు, కోడళ్లు, ఆడపడుచులు, కూతుళ్లు, అల్లుళ్లతో కలకలలాడాయి. నూతన వస్త్రాలు ధరించి ఇళ్ల వద్ద వివిధ రకాల రంగవల్లులు తీర్చిదిద్దారు. సంక్రాంతి గాలిపటాల పోటీలు, కేరింతలతో యువత ఆనందంగా జరిపారు. కొందరు పితృదేవతల పేరిట నూతన వస్త్రాలు, బియ్యం తదితర సామగ్రిని ఆయా గ్రామాల్లోని పురోహితులకు అందజేశారు. కనుమరోజు రైతు లు తమ పశువులను పసుపు, కుంకుమ, వివిధ రకాల పూలతో అలంకరిం చారు. వాహన, యంత్రాలకు పూజలు చేశారు. జంతు బలులు అర్పించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి కొత్తసినిమాలు చూసేందుకు యువత, నూతన జంటలు చేరుకోవడంతో సందడిగా మారింది.

Updated Date - 2022-01-17T05:04:48+05:30 IST