గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీపీ

ABN , First Publish Date - 2022-07-08T03:24:10+05:30 IST

గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కావలి ఎంపీపీ ఆలూరు కొండమ్మ పేర్కొన్నారు. కావలి ఎం

గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీపీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కొండమ్మ

కావలి రూరల్‌, జూలై7: గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కావలి ఎంపీపీ ఆలూరు కొండమ్మ పేర్కొన్నారు. కావలి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ  అధ్యక్షతన గురువారం మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు, మండల అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం వివిధ శాఖల అఽభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, మండల అభివృద్ధిపై జరిగే సమావేశాలకు అధికారులు హాజరుకాకపోవటం బాధాకర మన్నారు. ఎంపీడీవో అమ్మిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మూడు సమావేశాలకు సభ్యులు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దుచేసేలా ప్రభుత్వం  ఉత్తర్వులను జారీ చేసిందన్నారు.  మత్స్యకారులకు బోటు, ఇంజన్లు కావాలని పెదపట్టపుపాలెం ఎమ్పీటీసీ యాదగిరి, ఎఫ్‌డీవో లక్ష్మణ్‌ నాయక్‌ను కోరారు.  తుమ్మలపెంట ఎమ్పీటీసీ భ్రమరాంభ  మాట్లాడుతూ తమ ప్రాంతానికి అదనపు బస్‌ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మాధవరెడ్డి, మండల అధికారులు, ఎమ్పీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-08T03:24:10+05:30 IST