ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ABN , First Publish Date - 2022-05-23T06:01:46+05:30 IST

మండలంలోని ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబులు ఆదివారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకొని కొనుగోలు చేసిన వరి ధాన్యంను వెంటదివెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించాలని కొనుగోలు నిర్వాహకులతో పేర్కొన్నారు. లారీల కొరత లేకుండా చూడాలని, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోనె సంచుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని తెలిపారు. రైతులు తేమ శాతంను పాటిస్తూ కొనుగోలు నిర్వాహకులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

సారంగాపూర్‌, మే 22 : మండలంలోని ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబులు ఆదివారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకొని కొనుగోలు చేసిన వరి ధాన్యంను వెంటదివెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించాలని కొనుగోలు నిర్వాహకులతో పేర్కొన్నారు. లారీల కొరత లేకుండా చూడాలని, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోనె సంచుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని తెలిపారు. రైతులు తేమ శాతంను పాటిస్తూ కొనుగోలు నిర్వాహకులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు ఉన్నారు. 

Updated Date - 2022-05-23T06:01:46+05:30 IST