ఆర్‌యూలో నేడు స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2022-05-21T04:46:50+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీలో 3వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆర్‌యూలో  నేడు స్నాతకోత్సవం

కర్నూలు(అర్బన), మే 20: రాయలసీమ యూనివర్సిటీలో 3వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం క్యాంపప్‌లో ఓపెన ఎయిర్‌ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఉపకులపతి ఎ.ఆనందరావు ఆధ్వర్యంలో విద్యార్థు లకు డాక్టరేట్‌ పట్టాలను అందించేందుకు పరిశోధన విభాగం సిద్ధం చేసింది. గౌరవ డాక్టరేట్‌ ముగ్గురికి, పీహెచడీ- 241, పీజీ- 1,267, యూజీలో 15,339 మందికి పట్టాలు అందించనున్నారు. ఇందులో 2017లో 136కు 24, 2018లో 154కు 76, 2019లో 172కు 100, 2020లో 30 మందికి 20 మంది డిగ్రీలు పూర్తి చేసుకుని డాక్టరేట్‌ పట్టాలను అందుకో బోతున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన వర్చువల్‌ ద్వారా హాజరవుతారని రిజిసా్ట్రర్‌ మధుసూదనవర్మ తెలిపారు.

వివాదాల మధ్య..

  అనేక వివాదాల మధ్య రాయలసీమ విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. 152 మంది విద్యార్థులను డిటెన్షన పేరుతో 3వ సెమిస్టర్‌ పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడంపై ఇప్పటికే వామపక్ష విద్యార్థి సంఘాలు అధికారులను నిలదీస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని ఆరోపిస్తూ చివరకు గవర్నర్‌ కార్యాలయం ముట్టడికి దారి తీసింది. యూనివర్సిటీలో జరిగిన ప్రతి అవినీతిని ఆధారాలతో నిరూపిస్తామని యుజవన, విద్యార్థి జేఏసీ నాయకులు అధికారులకు సవాల్‌ విసురుతున్నారు.

సవాలు విసురుతున్న అంశాలివే..

  152 మంది విద్యార్థులను డిటెన్షన పేరుతో అనర్హులుగా ప్రకటించడం

  ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడం

 అక్రమంగా ఫ్రొఫెసర్ల నియామకాలు

  ఫ్రొఫెసర్‌పై విజిలెన్స నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం

  యూనివర్సిటీలో కీలకమైన ఫైళు చోరీ కావడం

  102 మంది టైం స్కేల్‌పై అవినీతి కుంభకోణం

  యూనివర్సిటీలో లేని కోర్సులకు పీహెచడీ పట్టాలు


Updated Date - 2022-05-21T04:46:50+05:30 IST