ఆ కిట్లు వద్దే వద్దు

ABN , First Publish Date - 2021-05-06T06:13:03+05:30 IST

జగనన్న విద్యాకానుక కిట్లు తీసుకోరాదని చిత్తూరు జిల్లా హెచ్‌ఎంల సంఘం అఽధ్యక్షుడు చెంగల్‌రాజు కోరారు.

ఆ కిట్లు వద్దే వద్దు

శ్రీకాళహస్తి,మే 5: జగనన్న విద్యాకానుక కిట్లు ఇప్పట్లో తీసుకోరాదని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అఽధ్యక్షుడు చెంగల్‌రాజు కోరారు. ఆ మేరకు సంఘ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడంపై బుధవారం ఆయన జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపారు. కరోనా విజృంభిస్తున్న వేళ హెచ్‌ఎంలు కిట్లు తీసుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులివ్వడం బాధాకరమన్నారు. కరోనా బారినపడి రాష్ట్రవ్యాప్తంగా 170 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాకానుక కిట్లు పాఠశాలలకు తరలించాలని విద్యాశాఖ ఆదేశించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వేసవి సెలవుల్లో సిబ్బంది అందుబాటులో లేరనీ, పాఠశాలలు పునఃప్రారంభమయ్యేంత వరకు కిట్లకు రక్షణ ఎవరు ఉంటారన్నారు. ప్రభుత్వం మానవతాదృక్పఽథంతో ఆలోచించి జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-05-06T06:13:03+05:30 IST