ప్రభుత్యోద్యోగులు... జీన్స్‌, టీషర్ట్లు ధరించొద్దు

ABN , First Publish Date - 2020-08-02T23:52:44+05:30 IST

కిందటి నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి ఓ అధికారి‘టి షర్ట్’ ధరించి వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే... డ్రెస్సింగ్ విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ప్రభుత్యోద్యోగులు... జీన్స్‌, టీషర్ట్లు ధరించొద్దు

భోపాల్ : కిందటి నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి ఓ అధికారి ‘టి షర్ట్’ ధరించి వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే... డ్రెస్సింగ్ విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.


సర్కారీ కొలువుల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించి విధులకు హాజరు కావద్దని ఆదేశించింది. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు టీ షర్టు ధరించడం హుందాతనం కాదని ఉత్తర్వులలో తెలిపింది.


గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యేటప్పుడు జీన్స్‌, టీ షర్టులు ధరించడంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి... డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులు హుందాగా, సాంప్రదాయకంగా ఉండే దుస్తులను ధరించి విధులకు హాజురు కావాలని ఆదేశించారు.




Updated Date - 2020-08-02T23:52:44+05:30 IST