ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2022-08-14T05:09:03+05:30 IST

రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.చంద్ర విమర్శించారు.

ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం
మాట్లాడుతున్న చంద్ర

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 13 : రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.చంద్ర విమర్శించారు. సీపీఐ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమేగాక నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా అమ్ముతోందని విమర్శించారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శిగా పి.సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శిగా షరీఫ్‌, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2022-08-14T05:09:03+05:30 IST