Abn logo
Jul 27 2021 @ 01:24AM

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం

మహాసభల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

రామన్నపేట, జూలై 26: ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.  మండల కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా డీవైఎఫ్‌ఐ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యోగ ప్రకటన అంటూ యువతను మోసం చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం  చేసిన కృషి ఏమీలేదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహ్మారావు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, నాయకులు కల్లూరి మల్లేశం, అబ్దాల్లాపురం వెంకటేష్‌, బొడ్డుపల్లి వెంకటేశం, మేక అశోక్‌రెడ్డి, నాగటి ఉపేందర్‌, బుగ్గ నవీన్‌, ఎదనూరి వెంకటేశం, పల్లె మధు కృష్ణ, యాదగిరి, ఖయ్యూం, ఎండీ.సలీం, జెల్లెల పెంటయ్య పాల్గొన్నారు.