Abn logo
May 25 2020 @ 04:55AM

టీటీడీ ఆస్తులకు కాపలాదారు మాత్రమే

కడప (మారుతీనగర్‌), మే 24: టీటీడీ ఆస్తులకు ప్రభుత్వం కాపలాదారులేనని,  దేవస్థానం ఆస్తుల అమ్మకాలపై కుట్ర  వెంటనే మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు హితవు పలికారు. ఆదివా రం హరిటవర్స్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీ ఆస్తులను బోర్డు అమ్మడానికి పూనుకోవడం సరైం ది కాదన్నారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇంతటి దురాగతం జరుగుతున్నా నిలుపుదల చేయడానికి ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్‌, నాయకులు రాంప్రసాద్‌, కోదండరామ్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.


ఖాజీపేట, మే24: దేవస్థాన ఆస్తులకు ప్రభుత్వం కాపలాదారుమాత్రమేనని అమ్మే హక్కు ఎవరిచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడుతూ దేవాదాయ భూములన్నీ అమ్మడానికి వీలులేదని కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంకన్న ఆస్తుల్ని అమ్మడం హిందువులందరినీ అవమానపరచడమేనన్నారు. శ్రీహరి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తక్షణం వెనక్కితీసుకోకుంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా, న్యాయ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.


పోరుమామిళ్ల, మే 24: టీటీడీ ఆస్తులు అమ్మేహక్కు ఎవరికీ లేదని మాజీ ఎమ్మెల్యే జయరాములు పేర్కొన్నారు. భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులు ఏ రూపంలో ఉన్నా వాటిని అమ్మే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం కేవలం కాపలా దారులేనన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరికీ రాకూడదన్నారు. గత పాలకులు కొందరు సర్వనాశనం అయ్యారన్నారు. 

Advertisement
Advertisement
Advertisement