మద్యం హోం డెలివరీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-04-01T04:27:36+05:30 IST

లాక్‌డౌన్ వేళ మందుబాబుల దుస్థితి వర్ణనాతీతం. మద్యం దొరక్కపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా దేశంలో పలుచోట్ల వెలుగుచూస్తున్నాయి.

మద్యం హోం డెలివరీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

షిల్లాంగ్: లాక్‌డౌన్ వేళ మందుబాబుల దుస్థితి వర్ణనాతీతం. మద్యం దొరక్కపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా దేశంలో పలుచోట్ల వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో వైద్యుడు రాసిచ్చిన చీటీ ఉంటే మద్యం కొనుగోలు చేసుకోవచ్చని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇప్పుడు మేఘాలయ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారు.. ఆ చీటీని ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసి ఇంటికే మద్యం తెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తోందని సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం సిద్ధం చేస్తోందట ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని లిక్కర్ సంస్థలకు హోం డెలివరీ చేసే అవకాశం కల్పించనుందట. ఈ సేవలు ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతాయని తెలుస్తోంది.

Updated Date - 2020-04-01T04:27:36+05:30 IST