Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుడగజంగాలను పట్టించుకోని ప్రభుత్వం

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 2: బుడగజంగాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి పే ర్కొన్నారు. గురువారం జమ్మలమడుగులోని నా గులకట్ట చౌడేశ్వరీదేవాల యం సమీపాన ఉన్న బుడగజంగం కాలనీని ఆయన సందర్శించారు. ముందుగా చౌడేశ్వరీదేవాలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతోపూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం స్థానిక బుడగజంగం కాలనీలో సమస్యలను బాధిత ప్రజలు తెలియజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన తమ వీధిలో మోకాళ్లలోతు నీరు నిలి చి గుడిసెలలోకి చేరాయన్నారు. తమకు నివాసానికి ఇళ్లు లేవని, తామున్న చోట రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. తమ కాలనీలో  మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బుడగ జంగం కాలనీలో రోడ ్లకు మట్టి తోలించి ఎత్తుచేస్తామని భూపేశ్‌ హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, ఎం.పుల్లారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, మోహన్‌, నల్లప్ప, చిన్న, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement