ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి

ABN , First Publish Date - 2022-05-27T04:53:41+05:30 IST

ప్రభుత్వ పథకాల గొప్పతనం ప్రజలకు చేరాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి
హోంనీడ్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 


వనపర్తి అర్బన్‌, మే 26: ప్రభుత్వ పథకాల గొప్పతనం ప్రజలకు చేరాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం టీఆర్‌ ఎస్‌ పార్టీ శిక్షణ తరగతి కమిటీ సభ్యులకు ఆ పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు అందించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం లోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలకు ఇకనుంచి నిరంతర రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ కమిటీ అఽధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, శిక్షణా కమిటీ సభ్యులుగా ఎన్నికైన నాగం సురేందర్‌రెడ్డి(నాగపూర్‌), ఆవుల రమేష్‌, కోళ్ల వెంకటేష్‌(వనపర్తి), విక్రమ్‌రెడ్డి, విప్పటూరు (ఘణపురం), నాగరాజు(చీర్కపల్లి), చంద్రశేఖర్‌ (వైస్‌ ఎంపీపీ, గోపాల్‌పేట), కర్రెస్వామి (ముని సిపల్‌ వైస్‌ చైర్మన్‌, పెబ్బేరు), రాధాకృష్ణ (నాగ రాల), జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డిలకు ని యామక ఉత్తర్వులు జారీ చేసి, అందజేశారు. 

 దళిత బంధు లబ్ధిదారులు  సీఎం కలను సాకారం చేయాలి

కొత్తకోట : దళితబంధు లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేయాలని మంత్రి నిరం జన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొత్తకోటలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న హోంనీడ్స్‌, ల్యాండ్‌ డిజటల్‌ సర్వే, ట్యాక్సీ యూనిట్లను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జె ట్‌ను లెక్క చేయకుండా పథకాన్ని అమలు చేస్తా మన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామ న్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ సుకేశిని, సింగిల్‌ విండో, సీడీసీ చైర్మన్లు వంశీధర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, విశ్వేశ్వర్‌, కౌన్సిలర్లు కొండారెడ్డి, సంధ్య, తిరుపతి, రాంమోహన్‌రెడ్డి, పద్మ, ఖాజామైనోద్దీన్‌, మిషేక్‌, పండ్లబండి రాము లు, అయ్యన్న, కొండారెడ్డి, భీంరెడ్డి, గాడీల ప్రశాం త్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌జీ, బాలకృష్ణ తదితరు లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-27T04:53:41+05:30 IST