Mla durgam chinnaiah: పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-30T03:42:31+05:30 IST

పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగం గా గురువారం రేచినిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.90 లక్షలతో నిర్మించనున్న డైనింగ్‌ హాల్‌, అదనపు తరగతి గదులు, తాగునీరు, మరమ్మతు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు.

Mla durgam chinnaiah: పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
పాఠశాలలో పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్‌, సెప్టెంబరు 29: పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగం గా గురువారం రేచినిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.90 లక్షలతో  నిర్మించనున్న డైనింగ్‌ హాల్‌, అదనపు తరగతి గదులు, తాగునీరు, మరమ్మతు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అంద జేశారు. ఎంపీపీ ప్రణయ్‌, జెడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీలు శంకర్‌, రజిత, మొగిలి శంకర్‌, సర్పంచులు నవీన్‌, రమేష్‌, కిస్టఫర్‌, దుర్గుబాయి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు నజీఖాన్‌, వైస్‌ ఎంపీపీ నారాయణ, సింగిల్‌ విండో చైర్మన్‌ దత్తు మూర్తి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రంజిత్‌, నాయకులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-30T03:42:31+05:30 IST