ప్రభుత్వాసుపత్రిలో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-16T06:06:26+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సీఐడీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 2014-18 మఽధ్య కాలంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ సర్వీస్‌ నిర్వహణకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ డీఎస్పీ భరత్‌ నేతృత్వంలో సీఐడీ బృందం రికార్డులను పరిశీలించింది.

ప్రభుత్వాసుపత్రిలో సీఐడీ తనిఖీలు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 15: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సీఐడీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 2014-18 మఽధ్య కాలంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ సర్వీస్‌ నిర్వహణకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ డీఎస్పీ భరత్‌ నేతృత్వంలో సీఐడీ బృందం రికార్డులను పరిశీలించింది.  దీనిపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమసుందరరావును వివరణ కోరగా.. ఏ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఆసుపత్రికి వచ్చినా ముందుగా స్టోర్‌లో ఎంట్రీ పడాలని, ఆ తర్వాతే దాన్ని సంబంధిత విభాగానికి చేరవేస్తారని అన్నారు. సీఐడీకి బయో మెడికల్‌ టెక్నీషియన్‌, స్టోర్‌ ఇన్‌ఛార్జి, కొందరు సిబ్బందిని సహాయకులుగా సమకూర్చామని చెప్పారు

Updated Date - 2021-04-16T06:06:26+05:30 IST