చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-15T04:58:05+05:30 IST

చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా విఫలమ య్యాయని జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున విమర్శించారు.

చేనేత కార్మికులను ఆదుకోవడంలో  ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న అవ్వారు మల్లికార్జున

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 14: చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అన్ని విధాలా విఫలమ య్యాయని జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున విమర్శించారు. ఆదివారం నాగులకట్ట చౌడేశ్వరీ ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక నిమిత్తం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందడం లేదన్నారు.   ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని విఫలమయ్యాయన్నారు. బీసీలకు 45  ఏళ్లకే పింఛన్‌ మంజూరు చేస్తామని,. చేనేత రుణమాఫీ చేస్తామని  పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీ మూడేళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. పట్టుపై రాయితీని వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పెంచుతానని  చెప్పి,్డ అధికారంలోకి రాగానే తుంగలో తొక్కాడన్నారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నీలూరి రుషింగప్ప, దక్షిణ భారత దేశ కన్వీనర్‌ గొరిగె కొండప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటా రామదాసు పాల్గొన్నారు. జాతీయ చేనేత ఐక్యవేదిక కార్యవర్గం జిల్లా గౌరవ అధ్యక్షులుగా శ్రీరామదాసు, ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడుగా చెన్నా రామయ్య, ఉపాధ్యక్షుడిగా గుద్దేటి బాలకృష్ణ, నూకల పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్‌, కార్యదర్శిగా నరసింహులు, ఊసువాండ్ల వెంకటేష్‌, కోశాధికారిగా ఆదిబోయిన విష్ణు, జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షుడు కుండా నాగరాజు, ప్రొద్దుటూరు అధ్యక్షులు పల్లా నరసయ్య, బద్వేలు అధ్యక్షులు చిట్టిసాయి, పులివెందుల అధ్యక్షుడుగా చిట్టిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


Updated Date - 2022-08-15T04:58:05+05:30 IST