పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం భరోసా

ABN , First Publish Date - 2021-06-21T06:02:21+05:30 IST

పేదింటి ఆడపిల్లలకు భద్రత, భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు తెచ్చిందని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం భరోసా
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

 రాజ్యసభ సభ్యుడు బడుగుల, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ క్రైం / నల్లగొండ రూరల్‌, జూన 20 :
పేదింటి ఆడపిల్లలకు భద్రత, భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు తెచ్చిందని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 424మ ంది లబ్ధిధారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించి మాట్లాడారు. ఆడపిల్లల భద్రత కోసం షీటీమ్స్‌, సమస్యల పరిష్కారానికి సఖి సెంటర్లను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, మార్కెట్‌ చైర్మన బొర్ర సుధాకర్‌, వైస్‌ చైర్మన మధుసూదనరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన నాగరత్నంరాజు, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, నాయకులు నిరంజనవలీ, సత్తయ్యగౌడ్‌, పంకజ్‌యాదవ్‌, ఫరీదోద్దీన రామరాజు పాల్గొన్నారు.
 రాములబండలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రారంభం
నల్లగొండ రూరల్‌ : మండలంలోని రాములబండ గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే దేవుని కృప ఉంటుందన్నారు. అనంతరం గుడి ఆవరణంలో ఏర్పాటు చేసిన హైమాస్టు లైటు ప్రార ంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి, మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, సర్పంచ అంజమ్మ, ఎంపీటీసీ మల్లేశం, ఎంపీటీసీలు, సర్పంచలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:02:21+05:30 IST