వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-08T04:02:46+05:30 IST

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైం దని ఆరోపిస్తూ బాధితులు ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు ఇంటిని ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీలకు చెందిన సుమారు 70 మంది వరద బాధితులు ర్యాలీగా వచ్చి ఎమ్మె ల్యే ఇంటి ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం తోనే వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందడం లేదని బాధితులు ఆరోపిం చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినా దాలు చేశారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించిన బాధితులు

మంచిర్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): వరద  బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైం దని ఆరోపిస్తూ బాధితులు ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు ఇంటిని ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీలకు చెందిన సుమారు  70 మంది వరద బాధితులు ర్యాలీగా వచ్చి ఎమ్మె ల్యే ఇంటి ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం తోనే వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన  సహాయం అందడం లేదని బాధితులు ఆరోపిం చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి కార ణంగానే నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అంద లేద న్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధి తులకు తక్షణ సహాయం కింద రూ. 10 వేలు చెల్లించారన్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు వరద సహాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారని, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి అవలంభిం చడం సమంజసం కాదన్నారు. కురుస్తున్న వర్షాలతో ఇండ్లు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వా నికి నివేదికలు సమర్పించినా స్పందించకపోవడం దారుణమ న్నారు. పట్టణ సీఐ నారాయణ నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు. ప్రభుత్వపరంగా సాయం అందేలా ఎమ్మెల్యే కృషి చేయాలని, లేకపోతే ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు.  

Updated Date - 2022-08-08T04:02:46+05:30 IST