నవరత్నాల పేరిట సర్కారు దోపిడీ

ABN , First Publish Date - 2022-06-27T06:11:38+05:30 IST

దొరికిన మేరకు అప్పులు చేసి నవరత్నాల పేరిట దోచుకోవడమే సర్కారు విధానమని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు.

నవరత్నాల పేరిట సర్కారు దోపిడీ
గుమ్మపాడులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న రమణమూర్తి:



  హంగులూ, ఆర్భాటాలే తప్ప అభివృద్ధి శూన్యం 

  ‘బాదుడే బాదుడు’లో మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి


సారవకోట (జలుమూరు) జూన్‌ 26:  దొరికిన మేరకు అప్పులు చేసి నవరత్నాల పేరిట దోచుకోవడమే సర్కారు విధానమని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో హంగులూ ఆర్భాటాలే తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. సారవకోట మండలం గుమ్మపాడు పంచాయతీలో ఆదివారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా కరపత్రాలను పంచిపెట్టి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి  మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభించి రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. అభివృద్ధికి నోచుకోని రాష్ట్రంగా తీర్చిదిద్దారని విమర్శించారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు ధర్మాన తేజకుమార్‌, సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, పట్ట ఉమామహేశ్వరరావు, బి.భాస్కరరావు, బి.గోవిందరావు ఇ.నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేశుపురంలో..

ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 26: మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు ఆధ్వర్యంలో కేశుపురం గ్రామంలో  ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఇం టింటికీ వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సాడి సహాదేవురెడ్డి, నాయకులు డి.కామేష్‌, ఎల్‌.పద్మ నాభం, బోర ప్రసాద్‌, కరగాన కృష్ణ, మాసుపత్రి పురుషోత్తం, పరశురాం, బతకల గణపతి తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-06-27T06:11:38+05:30 IST