Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వాల డ్రామాలు ఆపాలి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి 

నల్లగొండరూరల్‌, నవంబరు 26: ధా న్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రా మాలు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రం గారెడ్డి అన్నారు. పట్ట ణంలోని దొడ్డి కొమర య్య భవనంలో శుక్రవా రం జరిగిన పార్టీ సమా వేశంలో ఆయన మాట్లా డారు. పోడు భూముల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, రైతులకు పట్టాలు వెంట నే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో  రైతులతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో సంవత్సరాలుగా పట్టాలు, పాస్‌ పు స్తకాలు ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. వెంటనే ధా న్యం కొనుగోళ్లు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి,  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి ఐలయ్య, తుమ్మల వీరారెడ్డి,  పాలడుగు నాగార్జున, డబ్బీకార్‌ మల్లేశం, కందాల ప్రమీల, పాలడుగు పద్మావతి, శ్రీశైలం, నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement