ఈబీసీ నేస్తం చెక్కును విడుదల చేస్తు ఎమ్మెల్యే కొరముట్ల
రైల్వేకోడూరు, జనవరి 25: మహిళా పక్షపాతి జగన్ ప్రభుత్వం అని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఈబీసీ నేస్తం కింద మంజూరైన చెక్కు ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పకపోయినా అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేదలకు సహాయం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈబీసీ పఽథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగార్జునరావు, జడ్పీటీసీ సభ్యురాలు పాళెంకోట రత్నమ్మ, ఎంపీపీ సింగనమల భవాని పాల్గొన్నారు.