అన్నిరంగాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా

ABN , First Publish Date - 2020-09-20T09:28:56+05:30 IST

రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఎజెండా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు...

అన్నిరంగాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా

మంత్రి చామకూర మల్లారెడ్డి

పోచారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


ఘట్‌కేసర్‌: రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఎజెండా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో రూ.2.64లక్షలతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పార్కులను అభివృద్ధి చేసి పాదచారుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను నిర్మించినట్లు గుర్తుచేశారు. రోడ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణాలకు అధిక ప్రధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.


అనంతరం ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యామ్‌సన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్యా నాయక్‌, కమిషనర్‌ రఘు, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఏఈ నరేష్‌, ఆర్‌ఓ ప్రభాకర్‌, మేనేజర్‌ నర్సింహులు, మహేశ్‌, ధనలక్ష్మి, రాజశేఖర్‌, సాయిరెడ్డి, శైలజ, హిమ, బాల్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్‌, రవీంధర్‌, పోచమ్మ, అక్రం, శంకర్‌, బాలేష్‌, జగన్‌మోహన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.  


బాధిత కుటుంబాలకు పరామర్శ 

ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర: సింగిల్‌విండో డైరెక్టర్‌ వర్థ్యా నర్సింగ్‌నాయక్‌ ఈనెల 17న గుండెపోటుతో మృతిచెందగా ఆయన కుటుంబసభ్యులను మంత్రి మల్లారెడ్డి శనివారం పరామర్శించారు. మండలంలోని ఘణాపురం అనుబంధ గ్రామం ఫకీర్‌టెక్యాకు చెందిన వర్థ్యా నర్సింగ్‌నాయక్‌ ఘట్‌కేసర్‌ రైతు సేవా సహకార సంఘంలో 5వవార్డు నుంచి సింగిల్‌విండో డైరెక్టర్‌గా గెలుపొందారు. నర్సింగ్‌నాయక్‌ కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఘణాపురం సర్పంచ్‌ నానావత్‌ పద్మరూ్‌పసింగ్‌నాయక్‌ ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో పోచారం మునిసిపాలిటీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, రెడ్యానాయక్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రూప్‌సింగ్‌ నాయక్‌, వర్థ్యా పవన్‌నాయక్‌, బిక్షపతిగౌడ్‌ పాల్గొన్నారు. కీసర సహకార సంఘం పరిధి డైరెక్టర్‌ బిట్ల నర్సింహ అనారోగ్యంతో మృతిచెందగా మంత్రి మల్లారెడ్డి రాంపల్లి దాయరలోని నర్సింహ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, సత్తిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నారాయణశర్మ, సుధాకర్‌రెడ్డి, బుచ్చిరెడ్డిలతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T09:28:56+05:30 IST