లోటు రానివ్వరట!

ABN , First Publish Date - 2020-05-28T10:11:13+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో సర్కారీ పాఠశాలల్లో విద్య సజావుగానే సాగింది. కొన్ని లోటుపాట్లు

లోటు రానివ్వరట!

  • పాఠశాలలు తెరవగానే 
  • ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు 
  • పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, యూనిఫామ్‌, బూట్లు, టై ఒకేసారి ఇచ్చేస్తారట 
  • సర్కారీ పాఠశాలల సంస్కరణ దిశగా ప్రభుత్వం చర్యలు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో సర్కారీ పాఠశాలల్లో విద్య సజావుగానే సాగింది. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సర్వశిక్షా సొసైటీ ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధులను జోడించి ఎక్కడా ఎటువంటి లోటు రానీయకుండా వ్యవస్థను గాడిలో పెట్టారు. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్‌లో అందుకు తగ్గ నిధులు కేటాయిం చారు. ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేస్తోంది. గతంలో వేసవి సెలవుల తర్వాత పాఠశా లలు తెరిచాక ఆర్నెల్లు పూర్తయినా పిల్లలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ సరఫరా విషయంలో అక్కడక్కడా కొన్ని అవాంతరాలు ఏర్పడిన సంగతి వాస్తవమే. అయితే  ఇప్పుడు పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలకు అదనంగా నోటు పుస్త కాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక యూనిఫామ్‌, బూట్లు, టైం ఒకేసారి ఇస్తామని ప్రకటించింది. ఇదే కనుక జరిగితే విద్యార్థుల తల్లి దండ్రులు కష్టాల నుంచి గట్టెక్కుతారు. 


కొత్తగా ఏమిస్తారు 

మూడు జతల యూనిఫామ్‌కు సరిపడా క్లాత్‌, ఒక జత షూస్‌, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, పాఠ్య, నోటు పుస్తకాలను ఒక బ్యాగులో పెట్టి ఇస్తా రు. ఒకటి నుంచి పది తరగతుల విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తారు. ఒకటి నుంచి ఏడు వరకు బాలికలకు మాత్రమే బెల్టు ఇస్తారు. 8, 9, 10 తరగతుల బాలికలకు చుడీదార్లు ఇస్తారు. దుస్తుల కుట్టి కూలీ ఒక్కో జతకు రూ.40 ఇస్తారు. కానీ ఈ మొత్తానికి ఏ టైలరూ కుట్టడు. అదనపు ఖర్చును తల్లిదండ్రులు భరించాల్సిందే. గత ఏడాది టై కూడా ఇచ్చారు. ఈసారి దీని ప్రస్తావన లేదు. కానీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో 6 నుంచి 10 తరగతుల వరకు ఆంగ్ల మాధ్య మం ప్రారంభిస్తున్నందున కార్పొరేట్‌ స్కూళ్ల తరహాల్లో విద్యార్థుల వేషధారణ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నందున టై తప్పని సరిగా ఇస్తారని తెలుస్తోంది. 


విద్యా కానుక 

గత ప్రభుత్వాల పనితీరు వేరని, తమ పనితీరు వేరని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. సర్కారీ పాఠశా లల్లో విద్యార్థులకు ఎదురయ్యే అన్ని సమస్యలకూ చెక్‌ పెడతామంటోంది.  పాఠశాలలు తెరవగానే విద్యార్థులకు అవసరమైన అన్నింటినీ కలిపి ఒక కిట్‌గా అందివ్వడానికి విద్యా కానుక అమలు చేస్తున్నామని చెప్తోంది.


ఎంత మందికి ప్రయోజనం 

3,466 మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, 282 మునిసిపల్‌, నగరపాలక సంస్థ, 140 ఎయిడెడ్‌, 27 ప్రభుత్వ, 100 ఆశ్రమ, 2 ఆదర్శ, 24 రెసిడెన్షియల్‌ సొసైటీ, 345 గిరిజన పాఠశాలల్లో ఈ విద్యా సంవ త్సరంలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు చదివారు. వచ్చే విద్యా సంవత్సరంలో రెన్యువల్‌, కొత్తగా చేరేవారి సంఖ్యను బట్టి అందరికీ ఈ పథకంలో ప్రయోజనం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2020-05-28T10:11:13+05:30 IST