భద్రాద్రి రాముడి కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు

ABN , First Publish Date - 2021-02-25T05:42:46+05:30 IST

భద్రాద్రి సీతారామ కల్యాణానికి కావాల్సిన తలంబ్రాల బియ్యానికి వ డ్లు ఒలిచే అవకాశం ఆల్లూరు గ్రామ మహిళలు కలగడం అదృష్టమని చీరాల శ్రీ రఘరామభక్త సేవా సమితి నిర్వహకులు పోత్తూరి బాల కేశవులు పేర్కొన్నారు.

భద్రాద్రి రాముడి కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు
తలంబ్రాలను సిద్ధం చేస్తున్న మహిళలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24 : భద్రాద్రి సీతారామ కల్యాణానికి కావాల్సిన తలంబ్రాల బియ్యానికి వ డ్లు ఒలిచే అవకాశం ఆల్లూరు గ్రామ మహిళలు కలగడం అదృష్టమని చీరాల శ్రీ రఘరామభక్త సేవా సమితి నిర్వహకులు పోత్తూరి బాల కేశవులు పేర్కొన్నారు. ప్రతి ఏటా భద్రాది సీతారామ కల్యాణం కోసం కావాల్సిన తలంబ్రాల కోసం ప్రత్యేకంగా ఒక పొలంలో పండించిన వడ్లను వివిధ ప్రాంతాల్లోని భక్తులకు అందించి గోటి తో ఓలిపించి సేకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బుధవారం స్థానిక సీతమ్మపేరంటాల మందిరంలో గోటితలంబ్రాలను సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఉష, తిరుమల, రమణమ్మ, శైలజ, అంజలి, జాలమ్మ, సుబ్బ రావమ్మ, పారిజాతం, మౌనిక, సురేఖ, ఈశ్వరమ్మ, ఇందిర, సుబ్బారెడ్డి, సుజాత, శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:42:46+05:30 IST