డయాలిసిస్‌ బాధితులకు గెస్ట్‌ గాట్‌ టాలెంట్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-09-30T09:18:48+05:30 IST

డయాలిసిస్‌ బాధితుల కోసం నెఫ్రోప్లస్‌ ‘గెస్ట్‌ గాట్‌ టాలెంట్‌’ పోటీల సీజన్‌ మూడును ప్రకటించింది.

డయాలిసిస్‌ బాధితులకు  గెస్ట్‌ గాట్‌ టాలెంట్‌ పోటీలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): డయాలిసిస్‌ బాధితుల కోసం నెఫ్రోప్లస్‌ ‘గెస్ట్‌ గాట్‌ టాలెంట్‌’ పోటీల సీజన్‌ మూడును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసక్తి గల డయాలిసిస్‌ బాధితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెంటనే ఈ పోటీలకు దరఖాస్తులను పంపించాలని, నెల రోజు ల గడువు మాత్రమే ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శించాలనుకునే వారు అనే హ్యాష్‌ ట్యాగ్‌తో  అప్‌లోడ్‌ చేయవచ్చునని సూచించారు. ఇందులో పాల్గొనే వారు ఒక నిమిషం వీడియో క్లిప్‌ చిత్రాన్ని తమ పేరు, కాంటాక్ట్‌ వివరాలు, డయాలిసిస్‌ సెంటర్‌, చిరునామా సమాచారాన్ని పంపించాలని కోరారు. ఇలా నెఫ్రోప్లస్‌కు వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల30 వరకు అప్‌లోడ్‌ చేస్తామన్నారు. 

Updated Date - 2020-09-30T09:18:48+05:30 IST