Android ఫోన్ కస్టమర్లకు Google షాక్

ABN , First Publish Date - 2021-08-01T01:05:07+05:30 IST

Android ఫోన్ కస్టమర్లకు Google షాక్

Android ఫోన్ కస్టమర్లకు Google షాక్

న్యూఢిల్లీ: అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఆండ్రాయిండ్ ఫోన్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల యూట్యూబ్, Gmail యాప్‌లను యాక్సెస్ చేయలేమని పేర్కొంది. యాప్ వినియోగాన్ని కొనసాగించడానికి వినియోగదారులు ఆండ్రాయిడ్ 3.0 లేదా అంతకంటే ఎక్కువ అప్‌డేట్ చేయాలని సంస్థ వెల్లడించింది. వినియోగదారు డేటాను రక్షించడానికి మరియు ఖాతా భద్రతను నిర్వహించడానికి ఇది జరుగుతుందని తెలిపింది. 2.3.7 లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌లో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సైన్ ఇన్‌లకు గూగుల్ ఇకపై సపోర్టు చేయదని తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తోందని గూగుల్ పేర్కొంది.

Updated Date - 2021-08-01T01:05:07+05:30 IST