Google: గూగుల్ పెద్ద ప్రకటనే చేసిందిగా.. ఆ లోపు డౌన్‌లోడ్ చేసుకోకపోతే డేటా మొత్తాన్ని డిలీట్ చేసేస్తుందట..!

ABN , First Publish Date - 2022-09-04T00:23:56+05:30 IST

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తమ సొంత మెసెంజింగ్ సర్వీస్ అయిన గూగుల్ హ్యాంగౌట్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన తరుణంలో..

Google: గూగుల్ పెద్ద ప్రకటనే చేసిందిగా.. ఆ లోపు డౌన్‌లోడ్ చేసుకోకపోతే డేటా మొత్తాన్ని డిలీట్ చేసేస్తుందట..!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తమ సొంత మెసెంజింగ్ సర్వీస్ అయిన గూగుల్ హ్యాంగౌట్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన తరుణంలో Google Hangouts యూజర్లు అలర్ట్ కావాల్సిన టైమొచ్చింది. యూజర్లకు తాజాగా గూగుల్ ఒక మెయిల్ పంపించింది. గూగుల్ హ్యాంగౌట్స్‌ను గూగుల్ చాట్‌గా అప్‌గ్రేడ్ చేసిన గూగుల్ Old Chats కావాలనుకుంటే మాత్రం యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రానున్న నెలల్లో గూగుల్ చాట్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.


ఒకవేళ యూజర్లు నవంబర్ 1,2022 లోపు గూగుల్ చాట్‌కు మారకపోతే ఆటోమేటిక్‌గా నవంబర్ 1 నుంచి గూగుల్ చాట్‌కు Hangouts అప్‌గ్రేడ్ అవుతుంది. అనంతరం.. గూగుల్ చాట్ యూజర్లుగా గూగుల్ వారిని పరిగణిస్తుంది. జనవరి 1, 2023 లోపు హ్యాంగౌట్స్ చాట్స్ కావాలనుకుంటే ఆ డేటాను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆ తర్వాత Hangouts డేటా డిలీట్ చేయనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. అంటే.. 2023 సంవత్సరం ఆరంభంలో Hangouts కనుమరుగు కానుందనమాట. Google Takeout ద్వారా డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. Google Takeout ఉపయోగించి డేటాను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో చూడండి.



గూగుల్ హ్యాంగౌట్స్ (Google Hangouts) డేటాను డౌన్‌లోడ్ చేసుకోండిలా:


STEP 1: Google Takeout లోకి వెళ్లి Hangouts లో లాగిన్ అయిన గూగుల్ అకౌంట్‌తో sign in అవ్వాలి.


STEP 2: అందుబాటులో ఉన్న అప్లికేషన్స్‌లో Hangouts ను మాత్రమే సెలెక్ట్ చేసి మిగతావి డీ-సెలెక్ట్ చేయాలి.


STEP 3: నెక్ట్స్ స్టెప్‌ను క్లిక్ చేయండి.


STEP 4: హ్యాంగౌట్స్ త్వరలో గూగుల్ చాట్‌కు అప్‌గ్రేడ్ కాగానే వన్-టైం డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది


STEP 5: ఫైల్ టైప్‌ను సెలక్ట్ చేయండి


STEP 6: ఎక్స్‌పోర్ట్‌పై క్లిక్ చేయండి


STEP 7: Hangouts నుంచి ఫైల్స్ కాపీ అవుతున్నట్లు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ప్రాసెస్ పూర్తి కాగానే ఒక మెయిల్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకున్న డేటాను సేవ్ చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - 2022-09-04T00:23:56+05:30 IST