Abn logo
Sep 19 2020 @ 02:17AM

మంచి అమ్మాయిలు త్వరగా నిద్రిస్తారు

మార్కండేయ కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: తరచూ వివాదాస్పదవ్యాఖ్యలతో సంచలనం సృష్టించే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి అలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘మంచి అమ్మాయిలు త్వరగా నిద్రిస్తారు’ అని ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఫేస్‌బుక్‌లో కట్జూ పెట్టిన పోస్టుపై ఒక మహిళ కామెంట్‌ చేశారు. ఆమెకు కట్జూ బదులిచ్చారు.

వారిద్దరి మధ్య చాటింగ్‌ జరుగుతుండగా ఒక దశలో.. ‘నీకు నిద్ర రావట్లేదా?’ అని కట్జూ ఆమెను ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వకముందే.. ‘మంచి అమ్మాయిలు త్వరగా నిద్రిస్తారు’ అంటూ స్మైలీ ఎమోజీలు పెట్టారు. దీంతో కట్జూపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్జూ ఇలా మహిళలపై గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు.


Advertisement
Advertisement
Advertisement