కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణులు ఏం తినాలి?

ABN , First Publish Date - 2022-04-05T18:44:13+05:30 IST

గర్భిణి తీసుకునే ఆహారం మీదే కడుపులో బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం గర్భిణులు పాటించవలసిన ఆహార నియమాలు ఇవే!

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణులు ఏం తినాలి?

ఆంధ్రజ్యోతి(05-04-2022)

గర్భిణి తీసుకునే ఆహారం మీదే కడుపులో బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం గర్భిణులు పాటించవలసిన ఆహార నియమాలు ఇవే!


గర్భిణి సాధారణం కంటే 300 క్యాలరీలు అధికంగా తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండేలా, పోషకభరిత పదార్థాలనే ఎంచుకోవాలి.

గర్భిణి తీసుకునే క్యాల్షియం మీదే కడుపులో పెరిగే బిడ్డ ఎముకల దృఢత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భిణులు తప్పనిసరిగా పాలు, పెరుగు, జున్ను తీసుకోవాలి.

ఐరన్‌ సమృద్ధిగా శరీరానికి అందడం కోసం ప్రతి రోజూ ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, పండ్ల రసాలు తీసుకోవాలి.

వాంతుల సమస్య వేధిస్తున్నా, కడుపు నిండిన భావనతో ఆకలి మందగిస్తున్నా అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలి. ఒకేసారి భారీ భోజనం చేయకుండా, తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.

ఫోలేట్‌ కోసం కమలా పండ్లు తరచుగా తింటూ ఉండాలి. ఈ పండ్లు తినడం వల్ల మలబద్ధకం దరిచేరదు.

చిగుళ్ల వాపు, దంత సమస్యలు లాంటి చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు గర్భిణుల్లో సహాజం. అయితే వాటికి చిట్కాలు పాటించడం మాని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. అలాగే స్వీయ చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్‌ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.  

Updated Date - 2022-04-05T18:44:13+05:30 IST