Advertisement
Advertisement
Abn logo
Advertisement

సప్లిమెంట్స్‌ కంటే సంతులిత ఆహారం మేలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా చికిత్స లేదా నివారణకు ఎక్కువ మోతాదులో సప్లిమెంట్స్‌ వాడటం అంతా మంచిది కాదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. దానికి బదులుగా సంతులిత ఆహారం తీసుకుంటూ కొన్ని ఎక్సర్సైజ్‌ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో కరోనా నివారణకు ఎటువంటి ఔషధాలు అందుబాటులో లేవని, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిక్స్‌ ప్రతినిధి మెల్లిస మజుందార్‌ పేర్కొన్నారు. ఒక వేళ అటువంటివి ఉన్నాయని ప్రచారం చేయడం కూడా నేరమన్నారు.


వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, సి, డి, జింక్‌, ఐరన్‌ లభించే పదార్థాలను అత్యధికంగా తీసుకోవాలని సూచిస్తున్నాడు. తాజా పండ్లు, కూరగాయలు, కంటి నిండా నిద్ర వంటివి కూడా కరోనా రాకుండా తోడ్పడతాయని మజుందార్‌ అన్నారు. అయితే వీటిని ఎక్కువుగా కాకుండా సమతుల్యంగా స్వీకరించడం మేలు. కోవిడ్‌-19పై పోరులో జింక్‌, విటమిన్‌ సి పదార్థాలు ఉపయుక్తంగా ఉంటాయని కెంటకీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫ్రాంక్‌ రోమనెల్లీ అన్నారు

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement