జాతీయ అథ్లెటిక్స్‌లో నరేష్‌కు స్వర్ణం

ABN , First Publish Date - 2021-09-18T06:50:50+05:30 IST

జాతీయ అథ్లెటిక్స్‌లో నరేష్‌కు స్వర్ణం

జాతీయ అథ్లెటిక్స్‌లో నరేష్‌కు స్వర్ణం
100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన నరేష్‌కుమార్‌ (కుడి నుంచి మొదటి రన్నర్‌)

భవానీపురం, సెప్టెంబరు 17 : వరంగల్‌ జిల్లా హనుమకొండలో జరుగుతున్న 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కర్నూలుకు చెందిన కె.నరేష్‌కుమార్‌ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించాడు. 2001లో అనిల్‌కుమార్‌ పేరిట ఉన్న 10:37 సెకన్ల టైమింగ్‌ను 10:30 సెకన్లతో బ్రేక్‌ చేశాడు. భారత్‌లో ఉన్న ఐదుగురు ఫాస్టెస్ట్‌  స్పింటర్లలో నరేష్‌కుమార్‌ ఒకడిగా నిలిచాడు. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, శాప్‌ వీసీ, ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

రైల్వే అథ్లెట్‌ ప్రీతిలాంబాకు కాంస్యం

అలాగే, శుక్రవారం నాటి 3,000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో విజయవాడ రైల్వేశాఖలో జూనియర్‌ క్లర్కుగా పనిచేస్తున్న ప్రీతీలాంబా 10 నిమిషాల 22.45 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం సాధించింది. డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌ , ఏడీఆర్‌ఎంలు డి.శ్రీనివాస్‌, ఎం.శ్రీకాంత్‌, రైల్వే స్పోర్ట్సు ఆఫీసర్‌ వల్లేశ్వర్‌ అభినందించారు. 



Updated Date - 2021-09-18T06:50:50+05:30 IST