స్టేట్‌ రైఫిల్‌ షూటింగ్‌లో ఆకాశ్‌కు బంగారు పతకం

ABN , First Publish Date - 2021-03-07T06:40:28+05:30 IST

మండలంలోని గుంటపల్లికి చెందిన గెడ్డం ఆకాశ్‌ ఏపీ స్టేట్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో సత్తా చాటాడు.

స్టేట్‌ రైఫిల్‌ షూటింగ్‌లో ఆకాశ్‌కు బంగారు పతకం
బంగారు పతకం సాధించిన గెడ్డం ఆకాశ్‌

పాయకరావుపేట రూరల్‌, మార్చి 6 : మండలంలోని గుంటపల్లికి చెందిన గెడ్డం ఆకాశ్‌ ఏపీ స్టేట్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో సత్తా చాటాడు. రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నుంచి  శనివారం వరకు నిర్వహించిన జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో అత్యధిక పాయింట్లు పొంది గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. 600 పాయింట్లకు 581 పాయింట్లు సాధించాడని ఆకాశ్‌ తండ్రి, జి.సి.ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత గెడ్డం బుజ్జి తెలిపారు. 

Updated Date - 2021-03-07T06:40:28+05:30 IST