సరస్వతీదేవి అలంకారంలో మరగదాంబిక

ABN , First Publish Date - 2022-09-27T05:36:22+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన మరగదాంబిక దేవి సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు.

సరస్వతీదేవి అలంకారంలో మరగదాంబిక

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 26: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన మరగదాంబిక దేవి సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి మరగదాంబికదేవి ఉత్సవమూర్తిని పుర వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, గార్గేయ నదీ తీరంలో వెలసిన పాలేటమ్మ అలయంలో అమ్మవారు బాలత్రిపురసుందరీదేవిగా.. వైఎస్‌ గేటులోని చాముండేశ్వరి అమ్మవారు సౌభాగ్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. 


Updated Date - 2022-09-27T05:36:22+05:30 IST