గోదారంగనాఽథుల కల్యాణ మహోత్సవం

ABN , First Publish Date - 2021-01-14T06:22:33+05:30 IST

నగరంలోని పలు డివిజన్లలో గల ఆల యాల వద్ద భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి గోదారంగనాఽథుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా మేళతాళాలు వేద మంత్రోచ్ఛరణలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.

గోదారంగనాఽథుల కల్యాణ మహోత్సవం

 ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 13 : నగరంలోని పలు డివిజన్లలో గల ఆల యాల వద్ద భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి గోదారంగనాఽథుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా మేళతాళాలు వేద మంత్రోచ్ఛరణలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. గోదా రంగనాథుల కల్యాణంతో ధను ర్మాసం ముగిసినట్టు వేద పండితులు ప్రకటించారు. రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణాన్ని అర్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణచార్యులు జరిపిం చారు. పడమరవీధిలోని శ్రీనివాసుడి ఆలయంలో అర్చకులు రత్నాకరం శ్రీనివాసాచార్యులు జరిపారు. అగ్రహారంలోని జనార్దనస్వామి ఆలయం వద్ద పవన్‌కుమారాచార్యులు కల్యాణాన్ని భక్తులతో జరిపించారు. పవరుపేట వాసుదేవాలయం, అశోక్‌నగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయం, రామచంద్రరావ ుపేటలోని గోసంరక్షణ సమితి ప్రాంగణంలోను, దక్షిణపువీధిలోని రామాలయం వద్ద కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T06:22:33+05:30 IST