కమనీయంగా గోదా రంగనాథుల కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-01-14T05:27:42+05:30 IST

పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణోత్సవ వేడుకలు కమనీయంగా జరిగాయి.

కమనీయంగా గోదా రంగనాథుల కల్యాణోత్సవం
శోభాయమానంగా అలంకరించిన గోధారంగనాథుల విగ్రహాలు

పరవసించిన భక్తులు

మారుమ్రోగిన గోదా రంగనాథుల నామస్మరణం

భైంసా, జనవరి 13 : పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణోత్సవ వేడుకలు కమనీయంగా జరిగాయి. ఉదయం ప్రారంభమైన కల్యాణోత్సవ వేడుకలు సాయంత్రం ముగిశాయి. మంగళవాయిద్యాలు మోగుతుండగా పండితుల వేద మంత్రోచ్ఛరణాలతో స్వామి వారి కల్యాణ వేడుకలు చూడముచ్చటగా జరిగాయి. అంతకుముందే గోదారంగనాథుల ఉత్సవ విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలతో అతి సుందరంగా అలంకరించి పల్లకిలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళాభక్తుల గేయాలాపనలు, కోలాటాలు, పురు షుల నృత్యాల మధ్య  ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా రూపొందించిన కల్యాణ వేదికకు తీసుకువచ్చి ఆశీనులను చేశారు. అర్చక స్వాములు సాంప్రదాయ బద్దంగా, శాస్త్రోక్తంగా కళ్యాణఘట్టానికి సంబంధించిన పూజలు, పుణ్యః వచ నము, మధుపర్కము, జిలకర బెల్లం, కళ్యాణోత్సవ ఘట్టం తదితర పూజలను నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య అర్చకస్వాములు మంగళ సూత్రా న్ని ఇరువైపులా భక్తులకు చూపిస్తూ గోదాదేవి అమ్మవారికి రంగనాయక స్వామి మంగళసూత్రాధారణ ఘట్టాన్ని నిర్వహింపజేశారు. కల్యాణ మహో త్సవ ఘట్టాన్ని భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. గోదా రంగ నాయక స్వామి వార్ల నామస్మరణతో శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. భారీగా హాజరైన భక్తులు గోదా రంగ నాథులను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు

కళ్యాణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరారించాయి., పలువురు ఆలపించిన గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ  ఘట్టాలకు సంబంధించిన గేయాలను ఆల పించడంతో వేడుకలు కొనసాగాయి. పట్టణ పరిధిలోని భక్తులే కాకుండా సమీప ప్రాంతాల నుంచి భక్తులు అఽధికసంఖ్యలో తరలివచ్చి కళ్యాణోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. కళ్యాణ వేడుకలు ముగిసిన అనంతరం ఆలయ కమిటీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది.

Updated Date - 2021-01-14T05:27:42+05:30 IST