వైభవంగా వాడపల్లి వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-04-19T06:02:45+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.

వైభవంగా వాడపల్లి వెంకన్న కల్యాణం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 18: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం భక్తులను దర్శనాలకు అనుమతించారు. వేకువజామునే స్వామివారికి వివిధ ఆర్జిత సేవలు నిర్వహించారు.  వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.1,89,307 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 5వరోజు ఆదివారం రామానుజ తిరునక్షత్ర ఉత్స వాల్లో భాగంగా వేదపండితులు ద్రవిడవేద పారాయ ణం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, విద్యుత్‌ వెలుగుల నడుమ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

అన్నదాన ట్రస్టుకు రూ.76వేల విరాళం

వాడపల్లి వేంకటేశ్వరస్వామి అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తాయి పశ్చిమగోదావరి జిల్లా బొండాడకు చెందిన జి.సాయి రూ.10వేలు, కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన చింతకుంట నరేంద్ర నాగవెంకటకృష్ణ, రమాదేవి దంపతులు రూ.10,816, వెదిరేశ్వరానికి చెందిన అత్యం వీరవెంకట భాస్కరసీతారాముడు, దుర్గాభవానీ దంపతులు రూ.10,116, కాకినాడకు చెందిన మందవిల్లి శ్రీరామకృష్ణ, విశాలాక్షి దంపతులు రూ.10,201, అమలాపురానికి చెందిన గుమ్మళ్ల మురళీకృష్ణ, రాము దంపతులు రూ.10,010, రాజమహేంద్రవరానికి చెందిన తారకరామారావు, హిమబిందు దంపతులు రూ.10వేలు, కాకినాడకు చెందిన కందూరి కళ్యాణభరద్వాజ్‌ రూ.15 వేలు విరాళాలను నిత్యాన్నదాన ట్రస్టుకు సమర్పించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.



Updated Date - 2021-04-19T06:02:45+05:30 IST