మేక కడుపున వింత జంతువు

ABN , First Publish Date - 2020-10-28T18:11:42+05:30 IST

మేక కడుపున వింత ఆకారంలో జంతువు జన్మించింది..

మేక కడుపున వింత జంతువు

వేంపల్లె(కడప): మేక కడుపున వింత ఆకారంలో జంతువు జన్మించింది. తల మనిషి ఆకారం గాను, శరీరం పంది ఆకారంలోను కనిపిస్తోంది. వేంపల్లె మండలం తువ్వపల్లె గ్రామంలో మంగళవారం ఈ వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పర్ల కుమార్‌ అనే రైతుకు చెందిన మేక ఈనింది. వింతగా ఉండడంతో గ్రామస్థులు తిలకించేందుకు ఆసక్తి చూపారు. అయితే జన్మించిన వింత జంతువు కొద్దిసేపటికీ మృతి చెందడంతో పూడ్చిపెట్టినట్లు రైతు తెలిపారు.


Updated Date - 2020-10-28T18:11:42+05:30 IST