Viral Video: దేవుడు అంటే ఈ మేకకు ఎంత భక్తి.. గుడిలో హారతి ఇస్తుంటే ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2022-10-11T00:33:05+05:30 IST
ఓ మేకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘దేవుడు అంటే ఈ మేకకు ఎంత భక్తి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఇలాగే అభి
ఇంటర్నెట్ డెస్క్: ఓ మేకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘దేవుడు అంటే ఈ మేకకు ఎంత భక్తి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఇలాగే అభిప్రాయపడొచ్చు. ఎందుకంటే అది చేసిన పని అలాంటిది మరి. గుడిలో పూజారి హారతి ఇస్తుంటే మేక ఎంతో భక్తిశ్రద్ధలను కనబర్చింది.
ఆలయానికి వచ్చిన భక్తులు గర్భాలయం ముందు మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి తిరిగి వెళ్లిపోతుంటే.. ఓ మేక మాత్రం శ్రద్ధగా దేవుడుకి నమస్కరించింది. గడిలో మోకరిల్లి.. తలను కూడా కిందకు వంచి అత్యంత భక్తిశ్రద్ధలతో దేవుడుకి దండం పెట్టింది. ఆలయానికి వచ్చిన భక్తులు అటూ ఇటూ తిరుగుతున్నా.. మేక(Goat) మాత్రం తలను పక్కకు తిప్పలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్(Kanpur)లో ఉన్న బాబా ఆనందేశ్వర ఆలయంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్(viral)గా మారింది.