ఆమరణ నిరాహార దీక్షకు దిగి..

ABN , First Publish Date - 2022-08-10T06:11:08+05:30 IST

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుపై తిరుగుబాటుదారుల్లో ఒకరైన పూడిమడక వైసీపీ నాయకుడు మేరుగు అప్పలనాయుడు ఆమరణ నిరాహార దీక్షపూని... ఒక్క రోజుతోనే ముగించేశారు. ముందుగా ఆయన ఎమ్మెల్యేకు సంబంధించి పలు అంశాలపై ‘ప్లీజ్‌ సేవ్‌మీ సీఎం సార్‌’ అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన పెట్టారు.

ఆమరణ నిరాహార దీక్షకు దిగి..


ఒక్క రోజేలోనే ఉపసంహరణ?

పూడిమడక వైసీపీ నాయకుడి చర్య

ఎమ్మెల్యే కన్నబాబురాజుపై విచారణ జరపాలని  సామాజిక మాధ్యమాల్లో ప్రకటన 

24 గంటల్లోనే ముగించి ఇంటికి చేరిక 

అచ్యుతాపురం, ఆగస్టు 9:  ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుపై తిరుగుబాటుదారుల్లో ఒకరైన పూడిమడక వైసీపీ నాయకుడు మేరుగు అప్పలనాయుడు ఆమరణ నిరాహార దీక్షపూని... ఒక్క రోజుతోనే ముగించేశారు. ముందుగా ఆయన ఎమ్మెల్యేకు సంబంధించి పలు అంశాలపై ‘ప్లీజ్‌ సేవ్‌మీ సీఎం సార్‌’ అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన పెట్టారు. అందులో ‘కన్నబాబురాజు 2004లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యే సమయానికి పూడిమడకలో వార్డు మెంబరుగా ఉన్నాను. అప్పటికి ఎమ్మెల్యే కన్నబాబురాజు అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడు రూ.1500 కోట్లు సంపాదించారు. నీతి నిజాయతీకి మారుపేరని చెప్పుకుంటున్న కన్నబాబురాజుపై విచారణ జరపాలి. అంతవరకు తాను మంచి నీరు కూడా ముట్టను’ అని అందులో పేర్కొన్నారు. అనుకున్న విధంగా ఆయన సోమవావరం ఒక లాడ్జిలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏమైందో ఏమోగానీ మంగళవారానికి ఆయన లాడ్జిలో కనిపించలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. అయితే తోటి తిరుగుబాటుదారులు మందలించడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి చేరుకున్నారని ప్రచారంలో ఉంది. ఇదిలావుండగా, పూడిమడక గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అప్పలనాయుడ్ని తొలగించి, మంగళవారం సూరాడ ధనరాజ్‌ను నియమించారు. 

Updated Date - 2022-08-10T06:11:08+05:30 IST