Indigo: ఇండిగో విమానం నోస్ కింద ఇరుక్కుపోయిన కారు: వీడియో ఇదిగో

ABN , First Publish Date - 2022-08-02T22:44:58+05:30 IST

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో మంగళవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఇండిగో

Indigo: ఇండిగో విమానం నోస్ కింద ఇరుక్కుపోయిన కారు: వీడియో ఇదిగో

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో మంగళవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఇండిగో (Indigo) విమానం నోస్ కింద గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ (Go First airline)లోగో ఉన్న కారు ఒకటి ఇరుక్కుపోయింది. టెర్మినల్ 2 వద్ద విమానం పార్క్ చేసి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారును నోస్ వీల్ దాదాపు ఢీకొట్టినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ కారును ఆ తర్వాత బయటకు ఎలా తీశారన్న విషయంలో స్పష్టత లేదు.


అక్కడే ఉన్నవారు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  కారు డ్రైవర్ పొరపాటున విమానం కిందికి దానిని తీసుకెళ్లినట్టు ఆ సమయంలో అక్కడున్నవారు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) దర్యాప్తు చేయనుంది. ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. విమానం ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారమే పాట్నా బయలుదేరి వెళ్లినట్టు విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి.



Updated Date - 2022-08-02T22:44:58+05:30 IST