Abn logo
Oct 30 2020 @ 04:31AM

కరోనా కట్టడిలో కెమిస్టుల సేవలు నిరుపమానం

గుంటూరు, అక్టోబరు 29: కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ రాష్ట్రంలో ఎల్లప్పుడూ మెడికల్‌ షాపులను అందుబాటులో ఉంటూ కెమిస్టులు అందిస్తోన్న సేవలు వెలకట్టలేనివని అవగాహన సంస్థ సభ్యులు పేర్కొన్నారు.అ రండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ’కరోనా నియంత్రణలో కెమిస్టు పాత్ర’ అనే అంశంపై జరిగిన సమావేశంలో సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ కరోనా ఉధృతంగా ఉన్న సమయంలోనూ కెమిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణలో భాగస్వాములయ్యారన్నారు. కొందరు కెమిస్టులు విధి నిర్వహణలో కరోనా సోకి ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. కార్యక్రమంలో గుంటూరు రిటైల్‌ డ్రగ్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి టీవీ సాయిరామ్‌, చంద్రశేఖర్‌, ప్రభు ప్రసాద్‌ తదితరులున్నారు. 

Advertisement
Advertisement