పెరిగిపోతోన్న కుల వివక్ష

ABN , First Publish Date - 2020-10-01T09:57:05+05:30 IST

రాష్ట్రంలో కుల వివక్షత రోజురోజుకు పెరుగుతుందని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు.

పెరిగిపోతోన్న కుల వివక్ష

భక్షక భటులుగా మారిన పోలీసులు

జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేదు 

దళిత రక్షణ యాత్రల్లో నాయకుల ఆగ్రహం 


తుళ్లూరు, తాడేపల్లి,  సెప్టెంబరు 30: రాష్ట్రంలో కుల వివక్షత రోజురోజుకు పెరుగుతుందని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో బుధవారం దళిత రక్షణ యాత్రలు జరిగాయి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా

తయారయ్యారన్నారు. ప్రభుత్వ పోద్బలంతో పోలీసులు దళితులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కరోనా కాలంలో అనేక హత్యలు, శిరోముండనాలు, సాంఘీక బహిష్కరణలు, ఇళ్ల దగ్ధం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. 


వీటిపై కేవీపీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడంలేదన్నారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇచ్చినా తమ రాతలు మారటం లేదన్నారు. రాజధాని గ్రామం పెనుమాకలో కేవీపీఎస్‌ రాజధాని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో దళిత రక్షణ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌, సీఐటీయూ నాయకులు ఎం.రవి, ఎం.అనిల్‌ కుమార్‌, ఎం.భాగ్యరాజు, రజక వృత్తిదారు సంఘం  జిల్లా కార్యదర్శి వి.వెంకటేశ్వరావు, డివిజన్‌ రైతు సంఘం నాయకుడు ఎర్రపేరు, సీహెచ్‌ సుందరావు, ఎస్కే గని, శేషయ్య, సిఐటియు నాయకులు న్యూటన్‌ ఐజాక్‌,  కంపటి వీరయ్య తదితదరులు పాల్గొన్నారు.



  తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి టీ కృష్ణమోహన్‌  మాట్లాడుతూ  దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కుంచనపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర ప్రాతూరు, గుండిమెడ, మెల్లెంపూడి, చిర్రావూరు, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో జరిగింది.


కార్యక్రమంలో తాడేపల్లి సీపీఎం రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు అమ్మిశెట్టి రంగారావు, నల్లపు నీలాంబ్రం, బాబూరావు, పల్లె కృష్ణ, గుడివాడ సామ్యవాదం, బ్రహ్మయ్య, తాడిశెట్టి శ్రీనివాసరావు, రామస్వామి, జేమ్స్‌, విజయరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T09:57:05+05:30 IST